వయసుకు తగిన మాటలు మాట్లాడు.. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాం...

by Bhanu |   (  Updated:2025-11-28 12:54:08  IST  )

బిఆర్‌ఎస్‌ పార్టీ, కేటీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు కడియం శ్రీహరికి లేదని మాజీమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు.

వయసుకు తగిన మాటలు మాట్లాడు.. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాం...
X

దిశ వరంగల్‌ బ్యూరో : బిఆర్‌ఎస్‌ పార్టీ, కేటీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు కడియం శ్రీహరికి లేదని మాజీమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. స్టేషన్‌ ఘనపూర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. మీ ఇంటికి కేటీఆర్‌ దగ్గర డబ్బులు అడుక్కున్నది మర్చిపోయావా..? అని ప్రశ్నించారు. నీ వంశ చరిత్ర గురించి చెప్పగలవా...? కేటీఆర్‌ తన వంశ చరిత్ర చెప్పగలడన్నారు. కన్ను మిన్ను ఏరగకుండా తిన్నింటి వాసాలు లెక్క బెడుతున్నావ‌ని ధ్వ‌జ‌మెత్తారు. నీకు దమ్ముంటే రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చమని డిమాండ్‌ చేయాలన్నారు. వయసుకు తగిన మాటలు మాట్లాడు.. ఎక్కువ మాట్లాడితే నాలుక చీరేస్తాం... అన్నింటికి తెగించి ఉన్నాం తగ్గేదే లేదని ఆయన అన్నారు.

Next Story