కో-ఆపరేటివ్ కాదు... కో-ఆపరేటెడ్ మోసం..!

by Bhanu |

మండలంలోని కమలాపురం బిల్ట్ కర్మాగారంకు చెందిన ఏపీఆర్ ఎంప్లాయిస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రేడిట్ సొసైటీకి సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాల వివరాలు వాటి నిర్వహణ హెచ్.పీ గ్యాస్ క్రయ విక్రయాలకు సంబందించిన లెక్కలు చూపకుండా సొసైటీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని కార్మికులు ఒక ప్రకటనలో ఆరోపించారు.

కో-ఆపరేటివ్ కాదు... కో-ఆపరేటెడ్ మోసం..!
X

దిశ, మంగపేట : మండలంలోని కమలాపురం బిల్ట్ కర్మాగారంకు చెందిన ఏపీఆర్ ఎంప్లాయిస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రేడిట్ సొసైటీకి సంబంధించిన మూడు బ్యాంకు ఖాతాల వివరాలు వాటి నిర్వహణ హెచ్.పీ గ్యాస్ క్రయ విక్రయాలకు సంబందించిన లెక్కలు చూపకుండా సొసైటీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని కార్మికులు ఒక ప్రకటనలో ఆరోపించారు. సొసైటీ కార్యదర్శిగా భాధ్యతలు తీసుకోని సంవత్సరాలు గడిచినా ప్రతీ సంవత్సరం సొసైటీ యొక్క లాభ నస్టాలు ఆడిట్ చేయించి రిజిస్ట్రార్ కి అందజేయకుండా నిర్లక్షం వహించారని ఆరోపించారు. గతంలో పని చేసిన కార్యదర్శి ఎస్వీ.అప్పారావు సొసైటీకి పడ్డ బాకీ కింద తన పొలాన్ని రాసి ఇవ్వడం జరిగిందని దానికి సంబందించిన వివరాలు సొసైటీ లావాదేవీలు సంవత్సరాల తరబడి సభ్యలు సమాచారం కాని వివరాలు చెప్పలేదని ఆరోపించారు. సొసైటీ నిభంధన 1995 ప్రకారం నీ పదవీకాలం ముగిసినా పదవిలో కొనసాగుతూ సరైన రికార్డ్స్ ను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రతీ రోజు హెచ్.పీ గ్యాస్ సిలిండర్ల క్రయ విక్రయాల నిర్వాహణ కూడా సరిగా చేయడం లేదని ఈ విషయంలో కొన్ని రోజుల క్రితం సొసైటీ సభ్యులు అనుమానంతో ఆకస్మికంగా సొసైటీ కార్యాలయంలో తనిఖీలు చేయగా నివ్వరపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు.


గ్యాస్ అమ్మిన డబ్బులు ప్రతి రోజు బ్యాంకులో జమ చేయకుండా స్వంతానికి వాడుకుంటూ 15 నుండి 20 రోజులకు ఒక సారి బ్యాంకులో జామచేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సొసైటీ నుండి ఖర్చు చేసే ప్రతి రూపాయికి వోచర్ ద్వారా చెల్లించాల్సి ఉండగా ఎలాంటి ఓచర్లు లేకుండా డబ్బులు లెక్కలు రాసినట్లు గుర్తించినట్లు తెలిపారు. హెచ్,పి గ్యాస్ అగ్రిమెంట్ కాలపరిమితి 2024 నవంబర్ లో ముగియగా దాని రెనివల్ కోసం బిల్ట్ మాజీ డీజీఎం(హెచ్ఆర్)సంతకాన్ని ఫోర్జరీచేసి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి హెచ్.పీ గ్యాస్ కంపెనీకి పంపడంతో అది గుర్తించిన డీజీఎం హెచ్ఆర్ మంగపేట పోలిస్ స్టేషన్ లో మీపై కేసు నంబర్ 83/2025. తేది: 26.04.2025న ఎఫ్ఐఆర్ చేయించడం జరిగినందున మీరు సొసైటీ కార్యదర్శిగా కొనసాగుటకు అనర్హులు కనుక వెంటనే ఏపీఆర్ ఎంప్లాయిస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ క్రేడిట్ సొసైటీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి నిభందనలకు విరుద్దంగా వాడుకున్న నిధులను జమ చేసి సొసైటీ అకౌంట్, హెచ్.పీ గ్యాస్ అకౌంట్ లను ఆడిట్ చేయించి మాజీ కార్యదర్శి అప్పారావు పొలంకు సంబందించిన లావాదేవీలన్నీ సొసైటీ సభ్యులందరికీ తెలియపర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సొసైటీ సభ్యలు తీసుకునే చర్యలకు బాద్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Next Story