యూనియన్ బ్యాంక్ లో ‘పాము కలకలం’

by velandi.Saikiran |

మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంగళవారం పాము కలకలం సృష్టించింది. బ్యాంకు సిబ్బంది

యూనియన్ బ్యాంక్ లో ‘పాము కలకలం’
X

దిశ, మంగపేట : మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంగళవారం పాము కలకలం సృష్టించింది. బ్యాంకు సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం బ్యాంకు తాళాలు తీసి స్టోర్ రూములోని రికార్డుల్లో ఊడ్చుతున్న క్రమంలో సుమారు 6 ఫీట్ల పొడవున్న పాము ఒక్కసారిగా బయటకు వ‌చ్చింది. దీంతో బాలరాజు అనే సిబ్బంది, భయంతో బయటకు పరుగులు తీశాడు. అప్పటికే బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులు, అధికారులు పామును చూసి భయాందోళన చెందారు. వెంటనే స్నేక్ క్యాచర్ యాకూబ్ పాషా (పాముల పాషా)ను పిలిచారు. ఇక ఆ పామును పట్టి బయటకు తీసుకెళ్ల‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Next Story