- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ లో పొగలు.. పరుగులు తీసిన ప్రయాణికులు..
by Batti.Sumithra |
స్వర్ణ జయంతిసూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో శనివారం పొగలు వ్యాపించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్లో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

X
దిశ, గార్ల : స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో శనివారం పొగలు వ్యాపించిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల రైల్వేస్టేషన్లో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హజ్రత్ నిజామోద్దీన్ నుండి త్రివేండ్రం వైపు వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( ట్రైన్ నెంబర్ -12644) అప్ లైన్ లో గార్ల రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఏసీ కోచ్ (బి -2) నుండి పొగలు చెలరేగాయి. బ్యాటరీలో నెలకొన్న సాంకేతిక సమస్య వల్ల పొగలు వచ్చినట్లు టెక్నీషియన్లు తెలిపారు. కాగా పొగలు చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో సుమారుగా గంటపాటు రైలు ఆలస్యంగా నడిచింది.
Next Story






