స్మార్ట్ సిటీ రూ.84.20 కోట్ల‌తో భ‌ద్ర‌కాళి ట్యాంక్ బండ్

by Ratna Kumari |

వరంగల్ లో రూ. 84.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన భద్రకాళి ట్యాంక్ బండ్ ను, రాణి రుద్రమా ఐరన్ విగ్రహాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు.

స్మార్ట్ సిటీ రూ.84.20 కోట్ల‌తో భ‌ద్ర‌కాళి ట్యాంక్ బండ్
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : వరంగల్ లో రూ. 84.20 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నిర్మించిన భద్రకాళి ట్యాంక్ బండ్ ను, రాణి రుద్రమా ఐరన్ విగ్రహాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సంయుక్తంగా ప్రారంభించారు. ఓవైపు భద్రకాళి దేవాలయం, విశాలమైన చెరువు, పద్మాక్షి, సిద్దేశ్వరుల కొండల మధ్య భద్రకాళి ట్యాంక్ బండ్ నిర్మాణం చేశారు. నగరానికి మణిహారంలా ఉన్న భద్రకాళి బండ్ ప్రజలకు అందుబాటులోకి తీసుక రావడం ఆనందంగా ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్థన్నపేట ఎమ్మెల్యే కె. ఆర్. నాగరాజు,నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ కలెక్టర్, ఇన్ చార్జి మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్ పాయ్ తో పాటు డివిజన్ల కార్పొరేటర్లు విజయలక్ష్మి, కంది కల్పన, కోమల ఇతర అధికారులు పాల్గొన్నారు.

మంత్రుల చేతుల మీదుగా డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహప్రవేశాలు తెలంగాణ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖలు మంగళవారం ప్రారంభించారు. మంత్రులు దివ్యాంగులకు కేటాయించిన ఇళ్ల‌ను గృహప్రవేశాలు చేసి లబ్ధిదారులకి పత్రాలు అందజేశారు. పైడిపల్లిలో మొత్తం 6 బ్లాకులు నిర్మించగా, ప్రతి బ్లాక్‌లో 12 కుటుంబాలకు చొప్పున మొత్తం 70 ఇండ్ల నిర్మాణం చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ దివ్యాంగులు కోరిన విధంగా అనుకున్న సమయానికి లబ్ధిదారులకు రెండు పడక గదులు ఇళ్ల‌ను అందించినందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం పేదల పాలిట పెన్నిధి అని అన్నారు. ఈ 70 ఇళ్ల‌ నిర్మాణానికి రూ.371 లక్షలు వ్యయంతో నిర్మించిన ఈ గృహాలను దివ్యాంగులకు కేటాయించడం జరిగిందని కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ కలెక్టర్ జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, జ‌డ్పీ సీఈవో హౌసింగ్ పీడీ రామ్ రెడ్డి హౌసింగ్ డీఈ పాల్గొన్నారు.

Next Story