- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేడిగడ్డ బ్యారేజ్ గోదారిలో యువకులు గల్లంతు.. ఆకాశాన్నంటుతున్న తల్లిదండ్రుల రోదనలు
వేసవికాలం ఈత కొట్టడం సరదాగా యువకుల ఆనందోత్సవంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి స్థానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయిన విషాద ఘటన మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగింది.

దిశ, మల్హర్(మహాదేవపూర్): వేసవికాలం ఈత కొట్టడం సరదాగా యువకుల ఆనందోత్సవంతో మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి స్థానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయిన విషాద ఘటన మహాదేవపూర్ మండలం అంబటిపల్లి వద్ద శనివారం సాయంత్రం జరిగింది. అంబటిపల్లి గ్రామానికి చెందిన యువకులు నలుగురు, మహ ముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన ఒక్కరు పిపి స్తంభంపల్లికి చెందిన మరొకరి తో పాటు ఇంకొకరితో ఏడుగురు గోదావరిలో స్థానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు గోదావరిలో గల్లంతయ్యారు. పట్టి శివ అనే యువకుడు చాకచక్యంతో సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ విషాద ఘటన సమాచారం తెలవడం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటస్వామి కి చెందిన ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్ (18), శివ మనోజ్ (15), తోకరి రాజు చెందిన కుమారుడు తొగరి రక్షిత్(13), కర్నాల సమ్మయ్య కు చెందిన కుమారుడు కర్నాల సాగర్ (16), మహ ముత్తారం మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన బొల్లెట్ల పండు (18), పి పి స్తంభంపల్లి కి చెందిన పసుల రాహుల్ (19) అనే యువకులు గోదావరి స్నానానికి వచ్చి గల్లంతు కావడం పట్ల వారి కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
సంఘటన స్థలాన్ని మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ చేరుకొని గల్లంతమైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సాయంతో గల్లంతైన యువకుల కోసం గోదావరి నదిలో గాలిస్తున్నారు. వేసవి వేళ నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దిబ్బందానికి గురయ్యారు. యువకుల గళంతుపై ఆయన విచారం వ్యక్తం చేశారు. అధికారులు ఆ యువకుల ఆచూకీ తెలిసేలా రెస్క్యూ టీం తో గాలించండి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించాలని పోలీస్ శాఖను ఆదేశిస్తూ వారి కుటుంబ సభ్యులను ఓదార్చు సందేశం పంపించారు.






