ఆరేళ్ల బాలుడు మిస్సింగ్..

by Bhanu |

గూడూరు మండలం చిన్న ఎల్లపురం గ్రామ శివారు లక్ష్మణ్ తండా కు చెందిన ఆరేళ్ల బాలుడు వాంకుడోత్ జాన్ పాల్ అదృశ్యమైనట్లు గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.

ఆరేళ్ల బాలుడు మిస్సింగ్..
X

దిశ, గూడూరు: గూడూరు మండలం చిన్న ఎల్లపురం గ్రామ శివారు లక్ష్మణ్ తండా కు చెందిన ఆరేళ్ల బాలుడు వాంకుడోత్ జాన్ పాల్ అదృశ్యమైనట్లు గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు. చిన్న ఎల్లాపురం గ్రామానికి చెందిన కృష్ణమూర్తి సునీత దంపతుల ద్వితీయ కుమారుడు జాన్ పాల్ తన తండ్రితో కలిసి సీతానగరం శివారు ఆదివారంపేట బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఆటో లో వెళ్ళారు. తల్లి అక్కడే ఉండగా కుమారుడు తండ్రి తో కలిసి ఆటోలో లక్ష్మణ్ తండాకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆటోలోనే తండ్రి కుమారులు ఇద్దరు నిద్రకు ఉపక్రమించారు. తండ్రి లేచి చూచేసరికి కుమారుడు పక్కన లేకపోవడంతో చుట్టుపక్కల వెతకగా బాలుడి ఆచూకీ దొరకకపోవడంతో గూడూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ బాలుని ఆచూకీ తెలిసిన వారు క్రింది నంబర్లకు 9676899537, 8712656963, 8712656962, 8712656960 సమాచారం ఇవ్వగలరని తెలిపారు.




Next Story