- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మంగపేట : శ్రావణ మాసం సందర్బంగా మండల కేంద్రంలోని పొద్మూరు, మంగపేట పద్మశాలి వాడ, గంపోనిగూడెం, బానారివాడ కాలనీలకు చెందిన వందలాది మంది మహిళలు గురువారం బోనాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 11 గంటల నుండి 1 గంట వరకు మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా పోతురాజుల విన్యాసాలు, శివ సత్తుల ఆట పాటలు ప్రజలను అలరించాయి. మండల కేంద్రం బస్టాండ్ చౌరస్తా నుండి బొడ్రాయి వరకు బోనాలతో ఊరేంగింపుగా వెళ్లిన మహిళలు శివాలయం నుండి ముత్యాలమ్మ, పోశమ్మ ఆలయాలకు చేరి గోదావరి జాలలతో నూటొక్క బిందెలతో గ్రామ దేవతలకు అభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో శివసత్తు సంఘం మండల అద్యక్షుడు మానుపెల్లి వేణు, హరీష్, మహిళలు పాల్గొన్నారు.
Next Story






