- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగిశెట్టి శ్రీనివాస్ సేవలు అభినందనీయం : అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ
గంగిశెట్టి శ్రీనివాస్ సేవలు అభినందనీయమని అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ పేర్కొన్నారు.

దిశ, వెంకటాపూర్(రామప్ప) : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం మహా శివరాత్రిని పురస్కరించుకుని గంగిశెట్టి సరస్వతి జ్ఞాపకార్ధం వారి కుమారుడు గంగిశెట్టి శ్రీనివాస్ దాతగా ఉచిత శుద్ధి చేయబడిన త్రాగునీటి కేంద్రాన్ని ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా రామప్పలో ఉచిత త్రాగునీరు అందించడం గొప్ప విషయమని మహేందర్ జీ అభినందించారు. కార్యక్రమంలో వెంకటాపూర్ తహసీల్దార్ గిరిబాబు, రామప్ప ఆలయ కమిటీ చైర్మన్ మిల్కూరి ఐలయ్య, ఈ.ఓ శ్రీనివాస్, రామప్ప ఆలయ కమిటీ సభ్యులు, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, పిట్టల మధు, కోటి ములుగు లయన్స్ క్లబ్ సభ్యులు డి.బలరాం రెడ్డి, ఎస్. రవీందర్ రెడ్డి, పి. నాగరాజు, సి హెచ్. రమేష్, ఏ. రాజు,ఎం రమేష్, ఎస్ రవీందర్, సోమనర్సయ్య, ఎన్. రవీందర్ పాల్గొన్నారు.






