- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ, రాయపర్తి: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన వృద్ధుడి పరిస్థితి చూస్తే కంటనీరు తప్పదు. స్థానికుల వివరాల ప్రకారం.. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై ఓ బొలేరో వాహనం ఖమ్మం వైపు వెళ్తున్నది. అదే సమయంలో రాయపర్తి మండలం ఊకల్లు గ్రామానికి చెందిన జక్కుల మొండయ్య(65) రోడ్డు దాటుతుండగా.. బొలేరో వాహనం వృద్ధుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొండయ్య కుడి కాలు విరగడంతో పాటు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story








