చెర్లపాలెం రాజకీయాల్లో సంచలనం

by Bhanu |

స్థానిక సంస్థల ఎన్నికల వేళ చెర్లపాలెం గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్‌కు బలమైన ఆధారంగా ఉన్న కీలక నాయకులు పార్టీకి వీడ్కోలు పలకడంతో ఆ పార్టీ శ్రేణుల్లో దిగ్బంధన వాతావరణం నెలకొంది.

చెర్లపాలెం రాజకీయాల్లో సంచలనం
X

దిశ, తొర్రూరు : స్థానిక సంస్థల ఎన్నికల వేళ చెర్లపాలెం గ్రామంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్‌కు బలమైన ఆధారంగా ఉన్న కీలక నాయకులు పార్టీకి వీడ్కోలు పలకడంతో ఆ పార్టీ శ్రేణుల్లో దిగ్బంధన వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు గురువారం జరిగిన పరిణామాలతో మరింత స్పష్టమయ్యాయి. చెర్లపాలెం మాజీ సర్పంచ్ సట్ల నాగలక్ష్మి, మాజీ ఎంపీటీసీ ధర్మారావు కిరణ్‌ సహా సుమారు వందమంది కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొర్రూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన చేరిక కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.

నూతనంగా చేరిన నాయకులకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెర్లపాలెం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అభివృద్ధి, పారదర్శకత, ప్రజా సమస్యలకు స్పందించే నాయకత్వం కావాలన్న అభిలాష పెరుగుతోంది. అనుభవజ్ఞులైన నాయకుల చేరికతో కాంగ్రెస్ శక్తివంతం అవుతోంది. పార్టీలోకి వచ్చే వారికి గౌరవం, అవకాశాలు అందిస్తామ‌ని తెలిపారు. తాజా చేరికలతో చెర్లపాలెంలో కాంగ్రెస్ బలం గణనీయంగా పెరిగింది. గ్రామ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ రక్షణాత్మక స్థితిలోకి వెళ్లగా, కాంగ్రెస్ కొత్త ఊపుతో ముందుకు సాగుతోంది.

Next Story