- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూనియర్ విద్యార్థి పై సీనియర్ విద్యార్థుల దాడి
ప్రభుత్వ పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత

దిశ, ధర్మసాగర్ : జూనియర్ ఇంటర్ విద్యార్థి పై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం గురించి బాధిత విద్యార్థి తన తల్లిదండ్రులకు తెలియజేయగా, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ ఘటన పై ప్రిన్సిపాల్ అజయ్ కుమార్‌ను వివరణ కోరగా, కళాశాలలో కొంతమంది విద్యార్థుల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిన వెంటనే ముగ్గురు విద్యార్థులను కళాశాల నుండి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సెలవులకు ముందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి ఆ విషయాన్ని ఇంటికి వెళ్లిన తర్వాత తన తల్లిదండ్రులకు తెలిపాడు. అంతేకాక, కొంతమంది విద్యార్థులు రాత్రి సమయంలో గోడలు దూకి బయటకు వెళ్లి గ్రామంలో వివిధ చెడు కార్యక్రమాలలో పాల్గొంటున్నారని తెలిసింది. ఈ విషయంపై కళాశాల అధికారులు కొంతమందిని అడిగి తెలుసుకోగా, వారు కూడా అదే విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విషయం తెలిసిన వెంటనే చర్యలు తీసుకున్నాం. సంబంధిత ముగ్గురు విద్యార్థులను సస్పెండ్ చేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.






