ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం : మంత్రి సీతక్క

by Bhanu |

రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం : మంత్రి సీతక్క
X

దిశ, కొత్తగూడ : రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం, అంగన్వాడీ పిల్లలకు అక్షర అభ్యాసం, గోవిందాపురం గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రోసీడింగ్ కాపీల పంపిణీ తదితర కార్యక్రమాల నిమిత్తం జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... గత 10 సంవత్సరాలలో పేదవారికి ఇండ్లు నిర్మించే పథకం ఎవరు ప్రవేశపెట్టలేదని ప్రస్తుత ఇందిరమ్మ ప్రభుత్వం అర్హులైన ప్రతి పేదవారికి సొంత ఇంటి నిర్మాణం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది ఇందిరమ్మ పథకం అని మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఇండ్ల మంజూరు నిర్మాణాలు కొనసాగుతున్నాయని, దశలవారీగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని నిర్మించి ఇవ్వడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని. స్వయం సహాయక మహిళా బృందాలలో సభ్యురాలుగా ఉన్నవారికి వడ్డీ లేని రుణాల ద్వారా ఇండ్ల నిర్మాణం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళలు స్వయం సహాయక బృందాలలో చేరి ఆర్థిక అభివృద్ధి చెందాలని కుటుంబానికి చేయూతగా ఉండాలని కోరారు.

ఇప్పటికే మహిళ ఆర్థిక అభివృద్ధి కోసం గ్రామ ఐక్య సంఘాలకు మహిళ పొదుపు సంఘాలకు బస్సు రుణాలు, పెట్రోల్ పంపులు, రైస్ మిల్లులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, మంజూరు, వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. స్కూల్ యూనిఫార్మ్స్ స్టిచ్చింగ్ కోసం మహిళల సంఘాలకు జతకు 75 రూపాయల చొప్పున అందించి అటు వారి ఆర్థిక అభివృద్ధితో పాటు తోడ్పాటునందించటం జరుగుతుందని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇండ్లు నిర్మాణం ఉండగా ఏజెన్సీ ప్రాంతమైన మన జిల్లాకు మరిన్ని కలిపి రావడం సంతోషంగా ఉందని ప్రతి ఒక్కరూ ఇల్లు నిర్మించుకొని దశలవారీగా బిల్లులు పొందాలని ఆమె కోరారు.

ప్రభుత్వం విద్య, వైద్యం, ఆరోగ్యం, కోసం ప్రత్యేక కార్యచరణ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్ని వసతి గృహాలలో చదువుతున్న పిల్లలకు కాస్మోటిక్ చార్జీలు అత్యధిక శాతం పెంచిన ప్రభుత్వం మనదే అన్నారు. కొత్తగూడ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, డిగ్రీ కాలేజ్ , పాకాల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పాకాల కొత్తగూడం గంగారం వరకు సాగు నీరును ఇవ్వడం కోసం ప్రత్యేక కార్యచరణ చురుకుగా కొనసాగుతుందని ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తామని తెలిపారు.అంతకుముందు మండలంలో 20 లక్షల వ్యయంతో నిర్మించిన గోవిందాపురం నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు. బోయ రజిత- శ్రీను, దంపతుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గు పోసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

పిల్లలతో ప్రేమగా – తల్లిమమకారాన్ని చూపిన మంత్రి సీతక్క

పాఠశాలలో చిన్నారులను ఒడిలో కూర్చోబెట్టుకొని వారితో కలిసి అక్షరాలు రాసిన సీతక్క దృశ్యం హృదయాన్ని హత్తుకునేలా మారింది. బాల్యాన్ని పరిరక్షించే తల్లి ప్రేమను స్మరింపజేస్తూ, ఈ విధంగా సమాజంలో మార్పు కోసం నాయకులు చూపాల్సిన ఉదాహరణగా నిలిచిందని పలువురు అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ డివిజన్ అధికారి కృష్ణవేణి, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జిల్లా వెల్ఫేర్ అధికారిని ధనమ్మ, ప్రత్యేక అధికారి సురేష్, గంగారం కొత్తగూడా మండలాల తహసిల్దారులు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story