- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ములుగు ఏజెన్సీలో మంత్రి సీతక్క పర్యటన.. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన..
ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృధ్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

దిశ, ఏటూరునాగారం : ప్రజల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృధ్ది, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం రోజున మంత్రి సీతక్క ములుగు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్‌లో కలిసితో ములుగు ఏజెన్సీలో పర్యటించి, పలు అభివృద్ది కార్యక్రమాలకు, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హజరయ్యారు.
ముందుగా మంత్రి సీతక్క తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకుని మేడారంలో 1కోటి 98 లక్షలతో నిర్మించిన మేడారం పూజారుల అతిథి సముదాయ భవనమును అడిషినల్ కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏటూరునాగారం కు చేరుకున్నారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యార్దులకు పుస్తకాల, దుస్తుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్దులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు.
అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపణీ కార్యక్రమానికి ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, ఏటూరునాగారం ఏఏస్పీ శివం ఉపాద్యాయ, అదనపు కలెక్టర్లు మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్‌లతో కలిసి హజరైయి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏస్ఏస్ తాడ్వాయి,కన్నాయిగూడెం,మంగపేట మండలాలకు చెందిన నిరుపేద లబ్ది దారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను మంత్రి సీతక్క చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లడుతూ..నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు 5000 మంజూరు చేసారని, నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు అయినప్పటికి ఐటీడీఏను దృష్టిలో పెట్టుకుని అదనంగా 1500 మంజూరు చేశామన్నారు. మూడు విడతలుగా ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న బస్ డిపో పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్క మాట్లడుతూ..ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటు చేయాలనే చిరకాల వాంఛ నెరవేరిందన్నారు. ఏటూరునాగారం బస్ డిపో ఏర్పాటు చేయడం కోసం 7 కోట్లు కేటాయించడం జరిగిందని, ములుగు, మంగపేటలో బస్టాండ్ నిర్మాణం చేపట్టడంతో పాటు గట్టమ్మ వద్ద కూడా బస్టాండ్ నిర్మిస్తామని తెలిపారు.
బస్సు డిపో నిర్మాణ పనులు పూర్తి నాణ్యత చేయాలని ఆర్టీసీ అధికారులను మంత్రి సీతక్క అదేశించారు. మేడారం జాతర నాటికి బస్సు డిపో నిర్మాణ పనులు పూర్తి చేసి రవాణా శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంబించాలని సూచించారు. జాతర సమయానికి బస్సులు నడవాలని సూచించారు. ఏటూరునాగారం లో బస్ డిపో ఏర్పాటు చేస్తే మారు మూల ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో చిత్ర మిశ్రా, ఏఏస్పీ శివం ఉపాద్యాయ, అడిషినల్ కలెక్టర్ మహేందర్ జి, డిఆర్డిఓ సంపత్ రావు, ఆర్టీసీ ఆర్ఏం విజయబాను,డిప్యూటి ఆర్ ఏం కిరణ్,చీఫ్ ఇంజనీర్ భాస్కర్, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏంపీడీఓ రాజ్యలక్ష్మి, జిల్లా కాంగ్రస్ నాయకులు, మండల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






