ఈనెల 27 నుంచి 29 వరకు విత్తన మేళా

by Taduka Kalyani |

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వ తేదీ వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

ఈనెల 27 నుంచి 29 వరకు విత్తన మేళా
X

దిశ భూపాలపల్లి ప్రతినిధి : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 29 వ తేదీ వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వలన వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ఈ విత్తన మేళా ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. తక్కువ నీరు – ఎక్కువ లాభం ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచించారు. రైతులు సాంప్రదాయ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే వర్షాభావ పరిస్థితుల్లోనూ నష్టపోకుండా ఆర్థికంగా లాభపడవచ్చని సూచించారు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలతో అధిక దిగుబడులు పొందవచ్చు అని ఆయన పేర్కొన్నారు.

భూపాలపల్లి – పెద్దాపూర్ ఘన్‌పూర్ ఘన్‌పూర్

రేగొండ – రేగొండకొత్తపల్లి గోరి – సుల్తాన్‌పూర్

చిట్యాల – చిట్యాలమొగుళ్ళపల్లి – మొగుళ్ళపల్లి

టేకుమట్ల – టేకుమట్లమల్హర్‌రావు – తాడిచర్ల

కాటారం – కాటారంమహదేవ్‌పూర్ – బొమ్మాపూర్

మహముత్తారం – బోర్లగూడెంపలిమెల – గ్రామ పంచాయతీ కార్యాలయం రైతు వేదికలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Next Story