స‌ర్పంచ్ లు గ్రామంలో శ్రీరాముని పాల‌న చేయాలి : క‌లెక్ట‌ర్ శార‌దా

by Ratna Kumari |

నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను శ్రీరాముని వలె పరిపాలించి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు.

స‌ర్పంచ్ లు గ్రామంలో శ్రీరాముని పాల‌న చేయాలి : క‌లెక్ట‌ర్ శార‌దా
X

దిశ, గీసుకొండ : నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాలను శ్రీరాముని వలె పరిపాలించి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అన్నారు. దేశంలోనే ఆదర్శ గ్రామం అయినా మండలంలోని గంగదేవిపల్లి లో జిల్లాలోని 11 మండలాల నూతన సర్పంచులకు శిక్షణ తరగతులు నాలుగు విడతల్లో ఏర్పాటు చేశారు. సోమవారం మొదటి విడతలో భాగంగా గీసుకొండ , సంగెం, చెన్నారావు పేట మండలాలకు సంబంధించిన 84 మంది సర్పంచుల శిక్షణ తరగతుల కార్యక్రమంలో కలెక్టర్ సత్య శారదా మాట్లాడారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పారదర్శకంగా పరిపాలన నిర్వహించాలని అన్నారు. గ్రామాభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకొని అనునిత్యం కృషి చేయాలని కోరారు. వరంగల్ మహానగరం రాష్ట్రంలో రెండో రాజధానిగా అవతరించబోతుందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అన్నారని ఆమె గుర్తు చేశారు. వరంగల్ జిల్లా సర్పంచులు అందరూ ఏఐ వంటి టెక్నాలజీలను వాడి స్మార్ట్ పరిపాలన చేసి రాష్ట్రంలో వరంగల్ జిల్లాను ఆదర్శ జిల్లాగా చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పట్టు కలిగి ఉండి పరిపాలన ఎలా చేయాలేనిది నేర్పించడమే ఈ శిక్షణ తరగతులముఖ్య ఉద్దేశమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జ‌డ్పీ సీఈవో రాంరెడ్డి, టివోటీలు పాక శ్రీనివాస్, కూచన ప్రకాష్, చంద్రకాంత్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, సర్పంచ్ కూసం స్వరూప రమేష్, మూడు మండలాల కార్యదర్శులు, స‌ర్పంచ్ లు పాల్గొన్నారు.

Next Story