- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీఆర్ఏ పై సర్పంచ్ భర్త దాడి
మండలంలోని వంగర గ్రామంలో వీఆర్ఎ సతీష్ పై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ నోటీసు అందించేందుకు వెళ్లిన వీఆర్ఏ సతీష్‌పై వంగర గ్రామ సర్పంచ్ భర్త చేయి చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

దిశ, భీమదేవరపల్లి : మండలంలోని వంగర గ్రామంలో వీఆర్ఎ సతీష్ పై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ నోటీసు అందించేందుకు వెళ్లిన వీఆర్ఏ సతీష్‌పై వంగర గ్రామ సర్పంచ్ భర్త చేయి చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నోటీసు విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదంగా మారింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన సర్పంచ్ భర్త వీఆర్ఏ పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో వీఆర్ఎ సతీష్ కు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు నిరసనగా మండలంలోని వీఆర్ఏలు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. వీఆర్ఏ సతీష్ తన వీడియో రికార్డ్ తో తన మాటల ద్వారా ఇలా మాట్లాడారు. సర్పంచ్ అండతోనే తనపై దాడి జరిగిందని బాధితుడు సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. “నేను సర్పంచ్ భర్తను” అంటూ దుర్భాషలాడుతూ తనపై దాడి చేసినట్లు ఆయన ఆరోపించారు. అకారణంగా దాడి చేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వీఆర్ఏలు తెలిపారు. మరోవైపు సర్పంచ్ భర్త మాత్రం.. అతని పై తాను ఎలాంటి దుర్భషలాడలేదని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు.






