- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్ అభ్యర్థుల వింత ప్రచారం.. ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ
రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచడమే కాదు, చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచడమే కాదు, చిత్ర విచిత్ర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. అయితే అనేక గ్రామాల్లో ప్రస్తుతం కోతుల సమస్య ఎక్కువగా ఉండటంతో, వాటి బెడద తప్పించిన వారికే ఓటు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు. అనేక గ్రామ పంచాయితీల్లో ప్రస్తుతం కోతుల బెడదనే మేనిఫెస్టోగా తయారైందంటే ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. కాగా దీనినే అవకాశంగా తీసుకొని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రచారానికి తెర లేపారు. హన్మకొండ జిల్లా నేరేళ్లలో తమను ఎన్నుకుంటే కోతుల బాధ తప్పిస్తామని హామీ ఇస్తున్నారు.
ఊరికే హామీ ఇవ్వడమే కాకుండా.. తమ అనుచరులకు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణ వేయించి, వాటిని తరిమేయిస్తున్నారు. తమను ఎన్నుకుంటే శాశ్వతంగా కోతుల బెడద తప్పిస్తామని చెబుతున్నారు. కాగా గ్రామస్తులు, యువకులు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణతో కలిసి ఫోటోలు దిగుతున్నారు. పాపం ఓట్ల కోసం ఎన్ని తిప్పలు పడుతున్నారో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






