- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ , పగిడిద్దరాజు
by velandi.Saikiran |
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టివాగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం మొత్తం జనసంద్రంతో నిండిపోయింది.

X
దిశ, గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చింతల గట్టు వట్టివాగు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం మొత్తం జనసంద్రంతో నిండిపోయింది. జాతరలో తొలి ఘట్టమైన సారలమ్మ, పగిడిద్దరాజులు గద్దెలపైకి రావడంతో జాతర ప్రారంభమవుతుంది. సారలమ్మను గూడూరు మండలం మట్టేవాడ అటవీ ప్రాంతం నుండి పగిడిద్దరాజును జగన్నాయకులగూడెం నుండి జాతర ప్రాంగణానికి తీసుకువచ్చారు. సంతాన లక్ష్మిగా పేరు ఉన్న సారలమ్మకు భక్తులు అధిక సంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గూడూరు సిఐ సూర్యప్రకాష్, ఎస్ఐ గిరిధర్ రెడ్డిల ఆధ్వర్యంలో పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
Next Story






