- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సరదా ఈత’ ప్రాణాలకు ముప్పు
మండలంలోని కొప్పుల గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ కాలువలో గురువారం కొంతమంది యువకులు ఈతలు కొడుతు సరదా తీరుతున్నారు.

దిశ, శాయంపేట : మండలంలోని కొప్పుల గ్రామ శివారులో ఉన్న ఎస్సారెస్పీ కాలువలో గురువారం కొంతమంది యువకులు ఈతలు కొడుతు సరదా తీరుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో కాలువల్లో ఈతలు కొట్టడానికి యువకులు ఆసక్తి చూపుతున్నప్పటికీ ఇటువంటి చర్యలు ప్రాణాపాయానికి దారితీసే ప్రమాదం ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో కాలువల్లో ఈతలు కొడుతూ ప్రమాదాలకు గురైన ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో శాయంపేట పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కాలువలో ఈతలు కొట్టడం పూర్తిగా నిషేధించామని, ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధితులపై కేసులు నమోదు చేస్తామని శాయంపేట ఎస్సై జక్కుల పరమేశ్వర్ స్పష్టం చేశారు. గతంలో కూడా కాలువలో ఈతలు కొట్టిన పలువురు యువకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ కొందరు యువకులు హెచ్చరికలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ప్రజలు, ముఖ్యంగా యువత, తాత్కాలిక వినోదం కోసం ప్రాణాలను ప్రమాదంలో పెట్టకూడదని, కాలువలు, నీటి వనరుల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టి ఇటువంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉంచాలని కోరారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.






