సందీప్ కుటుంబానికి అమెరికా నుంచి సహాయం

by velandi.Saikiran |

సహాయం చేయాలనే మనసుంటే దూరం అడ్డంకి కాదని నిరూపించిన సంఘటన కొత్తగూడ మండలంలోని చోటు చేసుకుంది

సందీప్ కుటుంబానికి అమెరికా నుంచి సహాయం
X

దిశ, కొత్తగూడ : సహాయం చేయాలనే మనసుంటే దూరం అడ్డంకి కాదని నిరూపించిన సంఘటన కొత్తగూడ మండలంలోని చోటు చేసుకుంది. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏంపల్లి సందీప్ కుటుంబ పరిస్థితి గురించి తెలిసిన కొత్తగూడ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాజేష్, అమెరికాలో నివసిస్తున్న తన స్నేహితుడు హరికృష్ణకు విషయం వివరించారు.విషయం తెలిసిన వెంటనే హరికృష్ణ హృదయపూర్వకంగా స్పందించి. బాధిత కుటుంబానికి నావంతు సహాయంగా 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు లను ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాజేష్ చేతుల మీదగా బాధిత కుటుంబానికి అందజేశారు.

ఆ సహాయం అందిన సందీప్ కుటుంబం కన్నీటి పర్యంతమై దూరం ఎంత ఉన్నా మనసుంటే సహాయం చేయొచ్చు అని చెప్పిన మాటను కార్యరూపం దాల్చిన హరికృష్ణ మానవత్వానికి ప్రతీకగా నిలిచారని సెక్షన్ అధికారి రాజేష్ ను, సహాయ దాత రామకృష్ణ కు గ్రామ పెద్దలు, స్థానికులు ధన్యవాదములు తెలుపుతూ అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు కంగాల నాగేశ్వరావు, ఏంపల్లి నాగేశ్వరావు, జంగాల వినయ్, అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story