ఇష్టారాజ్యంగా త‌ర‌లిస్తున్న ఇసుక

by Ratna Kumari |

మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్ గ్రామ శివారులో చలి వాగులో ఎలాంటి ఇసుక క్వారీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇళ్ల‌ పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు.

ఇష్టారాజ్యంగా త‌ర‌లిస్తున్న ఇసుక
X

దిశ, టేకుమట్ల (మొగుళ్ల‌ప‌ల్లి) : మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్ గ్రామ శివారులో చలి వాగులో ఎలాంటి ఇసుక క్వారీ పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా ఇందిరమ్మ ఇళ్ల‌ పేరుతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అన్నారు. చలివాగులో సుక్క నీరు లేకుండా ఎండిపోయినది. చలివాగు ప్రవాహిక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల పొలాల్లో నీరు అందక ఉన్న బోర్లు ఎత్తిపోయే ప్రమాదం ఉన్నది. పొలాలు ఇప్పటికే కొన్ని ఎండిపోతూ ఉన్నాయి. పొట్టకొచ్చిన పొలాలకు ఈ సమయంలో నిరు అంద‌క‌పోతే రైతులు ఆరుకాలం పెట్టినటువంటి పెట్టుబడి రాక చేతికి వచ్చిన పొలం ఎండిపోతుంది. ఇసుకను ఇష్టానుసారంగా తరలించడం వల్లనే భూగర్భ జలాలు అడగండి పోయి ఉన్న బోర్లు ఎండిపోతున్నాయ‌ని పేర్కొన్నారు. తక్షణమే కలెక్టర్ స్పందించి ఇసుక దందాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఎండిపోతున్న పొలాలకు నీరు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని, రైతులను ఆదుకోవాలని, అక్రమంగా తరలిస్తున్నటువంటి ఇసుక బకాసురులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. వారి వెంట సీపీఐ ఎంఎల్ మండల కార్యదర్శి అంబాల అశ్వద్ధామ, అజయ్ ఉన్నారు.

Next Story