- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విధులకు డుమ్మా కొడితే జీతంలో కోత
విధులలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్ల జీతాలలో కోత విధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు.

విధులకు డుమ్మా కొడితే జీతంలో కోత
- కాంట్రాక్ట్ డాక్టర్లపై భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఫైర్
- మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ
దిశ, మహదేవపూర్ : విధులలో అలసత్వం వహిస్తున్న కాంట్రాక్ట్ డాక్టర్ల జీతాలలో కోత విధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం మహదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల హాజరు పట్టికను తనికి చేసి వైద్యులతో మాట్లాడారు. ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రాన్ని, జనరల్ వార్డును, బ్లెడ్ స్టోరేజ్ యూనిట్ ను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంత మంది కాంట్రాక్ట్ వైద్యులు విధులకు హాజరు కాకుండా జీత భత్యాలు పొందుతున్నట్లు గుర్తించిన జిల్లా కలెక్టర్ అలాంటి వారి జీతాలలో కోతలు విధించాలని ఆసుపత్రి సూపరిండెంట్ ను ఆదేశించారు. బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కు భవన నిర్మాణం పూర్తి అయ్యిందని సిబ్బందిని నియమిస్తామని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అనంతరం బి.సి బాలుర వసతి గృహాన్ని సందర్శించిన కలెక్టర్ వసతి గృహానికి కావాలసిన ప్రహరీ నిర్మాణం, కిటికీలు, తలుపులు, మరమ్మత్తులు, మరుగుదొడ్ల మరమ్మత్తులు చేపట్టాలని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, మండల ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్, ఎంపీడీవో రవీంద్రనాథ్, ఆసుపత్రి సూపరిండెంట్ విద్యావతి, ఆర్.ఎం.ఓ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






