ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-04-23 11:03:57  IST  )

నర్సంపేట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ప‌ని చేసే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సమ్మె చేపడుతున్న క్రమంలో బోలా శంకర్ అనే డ్రైవర్ పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..!
X

దిశ, నర్సంపేట / డైనమిక్ బ్యూరో: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించాలని కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. ఈ క్రమంలో సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‍గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ ఇవాళ నర్సంపేట బస్డాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. రెండు రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్.. తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ గౌడ్‍కు దాదాపు 90శాతం గాయాలయ్యాయి. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శంకర్ ఈ ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శంకర్‍ను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించిన‌ట్టు తెలుస్తోంది.

Next Story