- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టిందని తొర్రూర్ డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు.

ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్
సద్దుల బతుకమ్మ, దసరాకు లక్కీ డ్రా..
తొర్రూర్ డిపో మేనేజర్ పద్మావతి
దిశ తొర్రూర్ : సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (RTC) ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టిందని తొర్రూర్ డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు. 2025 సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 6 వరకు RTC రాజధాని, సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికులు ఈ లక్కీ డ్రాలో పాల్గొనే అర్హత కలిగి ఉంటారు. ప్రయాణికులు తమ టికెట్ వెనుక భాగంలో పేరు, ఊరు, ఫోన్ నంబర్ రాసి డ్రా బాక్స్‌లో వేసి పాల్గొనవచ్చు.లక్కీ డ్రా అక్టోబర్ 7న వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో నిర్వహించబడనుంది.
బహుమతులు :
మొదటి బహుమతి రూ. 25వేలు, రెండవ బహుమతి రూ.15వేలు, మూడవ బహుమతి రూ.10వేలు ఉంటుంది. ప్రయాణికులు RTC బస్సుల్లో ప్రయాణించడమే కాకుండా లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని తొర్రూర్ డిపో మేనేజర్ పద్మావతి తెలిపారు.






