దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం : మంత్రి సీతక్క

by Ratna Kumari |

దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి శ్రమ వలనే ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు.

దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకం : మంత్రి సీతక్క
X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి : దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని, వారి శ్రమ వలనే ఆర్థిక వ్యవస్థ బలపడుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మే డే ను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణం, హమాలీల సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలలో మంత్రి పాల్గొని కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి కార్మికుడు గౌరవంతో జీవించే హక్కు కలిగి ఉండాలని, వారికి తగిన వేతనం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మున్సిపల్ చైర్మన్ చింతనిప్పుల చంద్రకళ, ఏఐటీయూసీ నాయకులు జంపాల రవీందర్, వార్డు కౌన్సిలర్ లు, హమాలీల సంఘ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.
Next Story