- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహాజాతరలో భక్తులకు తీరనున్న కష్టాలు
మహాజాతరకు తరలివచ్చే లక్షలాది మందిభక్తులకు మెరుగైన రవాణాకోసం అధికారులు రోడ్డు పనులు చేపట్టారు.

దిశ, తాడ్వాయి: మహాజాతరకు తరలివచ్చే లక్షలాది మందిభక్తులకు మెరుగైన రవాణాకోసం అధికారులు రోడ్డు పనులు చేపట్టారు. వచ్చే ఏడాది జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు శాశ్వతంగా పనులు చేపడుతున్నారు, ఈక్రమంలో గద్దెల నుంచి జంపన్న వాగు వరకు రోడ్డువెడల్పు పనులు చేపట్టారు. మూడు రోజులుగా ఈ పనులు చేస్తున్నారు. రోడ్డుకు ఒక వైపున జేసీబీలతో కందకాలు తీసి మట్టిపోసి రోలర్ తో చదును చేస్తున్నారు. మేడారం దేవతల దర్శనానికి వస్తున్న భక్తులు రోడ్ల పనులను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రధాన రోడ్డు వెడల్పు చేసే పనులకు మోక్షం కలిగిందంటున్నారు.
పనులపై అధికారుల పట్టింపేది?
రోడ్డు పనుల వద్ద అధికారులు లేకపోవడంతో నాణ్యతపై అనుమానాలు వస్తున్నాయి. ఒక వైపు పనులు ముమ్మరంగా సాగుతున్నా పరిశీలించేందుకు అధికారులు అటువైపు కన్నెత్తిచూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనులను కాంట్రాక్టర్ పై వదిలేసి వెళ్లడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. గద్దెల ముందు నుంచి జంపన్నవాగు వరకు చేపట్టే రోడ్డు పనులను అధికారులెవరు పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్నాణ్యతకు తిలోదకాలు ఇచ్చాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోట్ల నిధులతో చేపట్టే పనులు మళ్లీ ముణ్నాళ్ల ముచ్చటగా మారుతాయనే విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజులు పనులు ముమ్మరంగా సాగుతుననా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం గమనార్హం.
తీరనున్న భక్తుల కష్టాలు..
రోడ్డు పనులతో లక్షలాదిమంది భక్తులకు కష్టాలు తీరనున్నాయి. మహాజాతర సమయంలో జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి మూటముల్లెలు తలపైపెట్టకుని కాలినడకన గద్దెలకు చేరుకుంటారు. ఈక్రమంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఒకవైపున వాహనాలు, మరొకవైపున భక్తులు నానా అవస్థలు పడేది. ప్రభుత్వం రోడ్డు వెడల్పునకు నిధులను మంజూరుచేసి పనులు చేపట్టడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






