- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నత్తనడకన రోడ్డు వెడల్పు పనులు
రాజ్యసభ సభ్యులు, మాజీ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సొంత గ్రామంపై మమకారంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని వందల కోట్లు విడుదల చేయించి చేపడుతున్న కేసముద్రం అభివృద్ధి పనులు నిదానంలో నత్తలతో పోటీ పడుతున్నాయి.

దిశ, కేసముద్రం : రాజ్యసభ సభ్యులు, మాజీ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సొంత గ్రామంపై మమకారంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని వందల కోట్లు విడుదల చేయించి చేపడుతున్న కేసముద్రం అభివృద్ధి పనులు నిదానంలో నత్తలతో పోటీ పడుతున్నాయి. ఉప్పరపల్లి రోడ్ లో, మార్కెట్ బజార్ లో రోడ్ వెడల్పు పనులు చాలా నిదానంగా నడుస్తున్నాయి. దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రాళ్ళు తేలి ఉండటం వలన వాహనాలకు పంక్చర్ లు అవుతూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కంకర తేలి ఉండటంతో ద్విచక్ర వాహన దారులు కింద పడి గాయాల పాలవుతున్నారు. రోడ్డు పై నీళ్లు కొట్టకపోవడం వలన దుమ్ము లేచి ఇళ్లలో ఉన్న వంటపాత్రలపై పడి ఆహారం ఆలస్యమవుతుంది. ముఖ్యంగా ఉప్పరపల్లి రోడ్ లో ప్రజలు తమ ఇంటి ముందు మెట్లు కూల్చటం వల్ల ఇంట్లో నుంచి బయటకు, లోపలకు వెళ్లడం చాలా కష్టంగా ఉన్నదని, త్వరితగతిన పనులు పూర్తయితే మెట్లు కట్టుకొని పరమత్తులు చేయించుకుంటామని ప్రజలు కోరుతున్నారు. "వేం" వారు చేసే అభివృద్ధి అధికారుల నిర్లక్షం వలన నెమ్మదించటం తో ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు తొందరగా జరిపించి ప్రజల ఇబ్బందులు తీర్చాలని స్థానికులు కోరుకుంటున్నారు.






