రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి..

by Bhanu |

రఘునాథపల్లి మండలంలో గోవర్థనగిరి గ్రామ బస్టాండ్ సమీపంలో కారు బైక్ డీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో మహిళా మృతి..
X

దిశ, జనగామ: రఘునాథపల్లి మండలంలో గోవర్థనగిరి గ్రామ బస్టాండ్ సమీపంలో కారు బైక్ డీ కొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాలు పరిశీలిస్తే బైక్ పై అన్నాచెల్లెలు మట్టెవాడ విజయ, లింగస్వామి వెళ్తుండగా వెనుక నుంచి కారు డీ కొట్టిందని అక్కడికక్కడే విజయ మృతి చెందారనీ లింగ స్వ్రామికి తీవ్ర గాయాలయ్యాయి అని స్థానికులు తెలిపారు. మృతురాలు స్టేషన్ ఘన్ పూర్ మండలం చాగల్ విలేజ్ కాగా క్షతగాత్రుడిది కోమల్ల విలేజ్ వారని ప్రమాద విషయం తెలుసుకున్న జనగామ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్ యాదవ్ హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద సంఘటనాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story