హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Kodari Anjali |

హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతిచెందారు.

హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, లింగాలఘణపురం: హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిలోని నెల్లుట్ల ఫ్లైఓవర్ సమీపంలో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకెళ్తే.. పంచరైన అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ టైర్ మారుస్తుండగా.. లారీ వచ్చి ఢీకొట్టడంతో దేవరపుల మండలానికి చెందిన జాట్ రోహిత్(22), దంతాలపల్లి మండలం బీరి శెట్టి గూడెం గ్రామానికి చెందిన ధోనికెల రాజేందర్(27), గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన అశోక్ లేలాండ్ గూడ్స్ వెహికల్ డ్రైవర్ మధు (29) మృతి చెందారు. హైదరాబాద్ నుంచి దేవరుప్పుల మండలానికి కిరాణా సరుకులతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం నెల్లుట్ల వంతెన సమీపానికి చేరుకోగానే టైర్లు పగిలిపోయినట్టు సమాచారం. దీంతో వాహనాన్ని నిలిపి టైరు మారుస్తుండగా, వెనుక నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story