ఆర్ఎంపీల అర్హతకు మించి వైద్యం చేయరాదు: జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ

by Bhanu |

ఆర్ఎంపీలు, పీఎంపీల అర్హతకు మించి వైద్యం చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని, ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా వైద్యాధికారులు హెచ్చరించారు.

ఆర్ఎంపీల అర్హతకు మించి వైద్యం చేయరాదు: జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ
X

దిశ, మంగపేట: ఆర్ఎంపీలు, పీఎంపీల అర్హతకు మించి వైద్యం చేస్తే ప్రజల ప్రాణాలకు ప్రమాదమని, ప్రభుత్వం తీసుకున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా వైద్యాధికారులు హెచ్చరించారు. రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్ల (ఆర్ఎంపీ), ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ల (పీఎంపీ) ధారాదత్త వైద్యం పై "దిశ" పత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో విపిన్ కుమార్ శుక్రవారం మండలంలోని ఆర్ఎంపీలు, పీఎంపీలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఆర్హతకు మించి హయ్యర్ యాంటిబయోటిక్స్, స్టిరాయిడ్లు వాడరాదని, జ్వరంతో వచ్చే రోగులకు ఒక రోజు మాత్రమే ప్రాథమిక చికిత్స అందించి రెండో రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించాలని, గర్భిణీలకు, రెండు సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు వైద్యం అందించకూడదని స్పష్టం చేశారు.

జ్వర లక్షణాలతో బాధపడే వ్యక్తుల సమాచారం తక్షణమే ప్రభుత్వ ఆరోగ్య సిబ్బందికి అందించాలని, వారు తగిన చర్యలు – ఇంటింటి ఫీవర్ సర్వే, ఆంటీ లార్వా స్ప్రే, ఆయిల్ బాల్స్ వంటివి చేపడతారని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అవసరమైన మందులు, ల్యాబ్ రీజెంట్లు సమకూర్చుకోవాలని, లేదంటే శాఖాపరంగా చర్యలు తీసుకోవడం తో పాటు కేసులు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ స్వప్నిత, డెమో సంపత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పూర్ణ, సంపత్ రావు, శారద, మండలానికి చెందిన ఆర్ఎంపీలు, పీఎంపీలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story