- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీలో బియ్యం మాయం..బ్లాక్ మార్కెట్‌కు తరలినట్లు ఆరోపణలు
విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటుగా పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాలు, వసతి గృహాల్లో అన్ని వసతులతో పాటుగా నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తోంది. అందులో భాగంగానే సన్నబియ్యం, నాణ్యమైన కిరాణ సరుకులు, విద్యార్థులకు ఆరోగ్యానికి స్నాక్స్ ఏర్పాటు చేస్తోంది.

దిశ, డోర్నకల్/మరిపెడ: విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటుగా పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాలు, వసతి గృహాల్లో అన్ని వసతులతో పాటుగా నాణ్యమైన భోజన సదుపాయం కల్పిస్తోంది. అందులో భాగంగానే సన్నబియ్యం, నాణ్యమైన కిరాణ సరుకులు, విద్యార్థులకు ఆరోగ్యానికి స్నాక్స్ ఏర్పాటు చేస్తోంది. అయితే ఇదే అక్రమార్కులకు వరంగా మారుతోంది. ప్రభుత్వం గురుకులాలకు అందిస్తున్న బియ్యం, సరుకుల్లో చేతివాటం ప్రదర్శిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దసరా సెలవులు సమీపిస్తున్న వేళ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడలోని కేజీవీజీ పాఠశాలలో బియ్యం కోటాలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. సెలవులను ఆసరాగా చేసుకుని పాఠశాలలోని ఓ మేడం విద్యార్థుల కోటాను పక్కదారి పట్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
బియ్యం ఎటుపోయాయి?
నేరడ కేజీవీబీ పాఠశాలకు ప్రతీనెల 36.40క్వింటాళ్ల కోటా బియ్యం పంపిణీ చేయటం జరుగుతుంది. అయితే ప్రతి నెల మిగులు ఇండెంట్ పోను మిగతా స్టాక్ కేజీవీబీకి సివిల్ సప్లయ్ మహబూబాబాద్ నుంచి సరఫరా అవుతోంది. ఈ క్రమంలోనే ఈ నెల ఇండెంట్ స్టాక్ 11.50క్వింటాళ్ల బియ్యం ఉండగా మిగతా కోటా 24.90క్వింటాళ్ల బియ్యం 50బస్తాలు కేజీవీబీకి ఈ నెల 17వ తేదీన సివిల్ సప్లయ్ అధికారులు పంపించారు. అయితే పంపించిన బియ్యం మొత్తం పాఠశాలకు చేరుకోవాల్సి ఉండగా పాఠశాలలో మాత్రం 20బస్తాలు 10క్వింటాళ్లు మాత్రమే స్టోర్ కు చేరింది. మిగతా బియ్యం మాయమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ బియ్యం పాఠశాల పెద్ద మేడం కనుసన్నల్లోనే బ్లాక్ మార్కెట్ కు తరలినట్లు ఆరోపణలొస్తున్నాయి.
స్నాక్స్, నూనె తదితర వస్తువులు సైతం..
విద్యార్థినులు రక్తహీనతకు, అనారోగ్యానికి గురవకుండా ఉండేందుకు ప్రభుత్వం నాణ్యమైన సరుకులు, స్నాక్స్, డ్రై ఫ్యూట్స్ పాఠశాలకు సరఫరా చేస్తుంది. అయితే మేడం ఈ సరుకులన్నిటిని బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెద్ద మేడం కజిన్ బ్రదర్ స్టోర్ కు సరుకులు పంపి బహిరంగా మార్కెట్లో విక్రయిస్తున్నట్లు సమాచారం. పాఠశాలకు ఇటీవల వచ్చిన రెండు కాటన్ల నూనె, డ్రైఫ్రూట్స్, స్నాక్స్ మొత్తం తరలించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పదమూడేళ్లుగా ఇదే తంతు..
కురవి కేజీవిబీ పాఠశాలలో ఈ తతంగం కేవలం ఈ ఒక్క నెలే కాదు ప్రతి నెలా ఎంతో కొంత బియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. పదమూడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్ ఉండటంతో పెద్ద మేడం ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగుతోంది. ఆమె పాఠశాలలోని ఇద్దరు కింది స్థాయి సిబ్బందితో కలిసి ఈ దందా కొన్నేళ్లుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో బ్లాక్ దందా యథేచ్ఛగా జరుగుతుందా? లేక వారికి తెలిసే జరుగుతుందా అని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






