- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ రైడ్.. అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆర్.ఐ
by Ratna Kumari |
లంచం తీసుకుంటూ దుగ్గొండి మండల రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సంఘటన దుగ్గొండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

X
దిశ, నర్సంపేట : లంచం తీసుకుంటూ దుగ్గొండి మండల రెవెన్యూ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన సంఘటన దుగ్గొండి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. దుగ్గొండి మండలంలోని మధిర గ్రామానికి చెందిన ఎల్.రాజు తండ్రి నర్సయ్య మరణించడంతో వారసత్వ భూమి 27 గుంటల బదిలీ కోసం ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారి సదరు వ్యక్తిని లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఎమ్మార్వో కార్యాలయంలో లంచం రూ. 10వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెవెన్యూ అధికారి రాంబాబును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యాలయంలో పలు రికార్డులను సైతం ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నర్సంపేట డివిజన్ లోని రెవెన్యూ కార్యాలయాల్లో అలజడి నెలకొంది.
Next Story






