- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూములు అమ్మడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పని చేస్తుంది : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
భూములు అమ్మడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. గురువారం వరంగల్ పర్యటనలో భాగంగా విచ్చేసిన రాంచందర్ రావుకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అ

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : భూములు అమ్మడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. గురువారం వరంగల్ పర్యటనలో భాగంగా విచ్చేసిన రాంచందర్ రావుకు బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా భద్రకాళి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాంచందర్ రావు మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేయలేదని కేవలం కేంద్ర నిధులతో మాత్రమే వరంగల్ అభివృద్ధి చెందిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాల వేళ ప్రజా ఉపయోగ చర్చ ఏది జరగలేదని ప్రజల ధనం, సమయం వృధా చేశారని అన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని బీజేపీ ద్వారా మాత్రమే మున్సిపాలిటీల అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూములు అప్పగిస్తే త్వరలో అధునాతన ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామని దానికి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, బిజెపి జిల్లా అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, కార్పొరేటర్లు, బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.






