రేవంత్ రెడ్డి వెలమలకు క్షమాపణ చెప్పాలి

by Ratna Kumari |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెలమల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వేలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి వెలమలకు క్షమాపణ చెప్పాలి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెలమల పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెంటనే వెలమలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని వేలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నడిపెల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ శనివారం హనుమకొండ ఏకశీల పార్క్ వద్ద వెలమ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి క‌లెక్ట‌రేట్ వరకు ర్యాలీ నిర్వహించి డీఆర్ఓ వై.వీ. గణేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. బాధ్యత గల పదవిలో ఉండి ఒక కులాన్ని టార్గెట్గా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు అన్నారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధిస్తే తెలంగాణ ప్రజలందరూ జాతిపిత అని గర్విస్తుంటే రేవంత్ రెడ్డి ఓర్వలేక పోతున్నారని అన్నారు. కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ రెడ్డి బూతు పిత అని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఒక కులాన్ని టార్గెట్ చేయడం మానుకొని ఇప్పటికే చేసిన వ్యాఖ్యలకు వెలమ కులానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ కాకుల మర్రి ప్రవీణ్ కుమార్, కోశాధికారి సిద్దూరి స్వామి రావు, వెలమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Next Story