- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ
దాదాపు 23 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ.హెచ్. రమేష్ బాబు గురువారం పదవీ విరమణ చేశారు.

దిశ, భూపాలపల్లి ప్రతినిధి : దాదాపు 23 సంవత్సరాల సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ.హెచ్. రమేష్ బాబు గురువారం పదవీ విరమణ చేశారు. 2003లో న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టి రాష్ట్ర న్యాయ వ్యవస్థలో వివిధ ఉన్నత స్థానాల్లో సేవలందించిన జడ్జి పదవీ విరమణ చేయడం పట్ల అందరూ విచారాన్ని వ్యక్తం చేశారు. అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం రిటైర్మెంట్ ప్రోగ్రాం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పది మంది జడ్జి లు హాజరయ్యారు. రమేష్ బాబు సేవలను, వారి ఆదర్శ జీవితాన్ని అందరు ముక్తకంఠంతో కొనియాడారు.
విశ్రాంత జీవితంలో వారు సమాజ సేవ చేయాలనీ జడ్జి కూతురు చిట్టూరి వైష్ణవి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. అందరు కలిసి జడ్జి ని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్జి గారి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్యచంద్ర కల, వరంగల్ ప్రధాన న్యాయమూర్తి వి.బి. నిర్మల గీతాంబ, వరంగల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి జే. మైత్రేయి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జి టి. కన్హయ్య లాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. ఆర్. దిలీప్ కుమార్ నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల రాములు తదితరులు పాల్గొన్నారు.






