రైలు నుంచి జారి పడి రిటైర్డ్ ఉద్యోగి మృతి

by velandi.Saikiran |   (  Updated:2025-08-23 13:59:07  IST  )

ప్రమాదవశాత్తు రైలు నుండి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మనోహరబాద్

రైలు నుంచి జారి పడి రిటైర్డ్ ఉద్యోగి మృతి
X

దిశ, తూప్రాన్: ప్రమాదవశాత్తు రైలు నుండి జారి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మనోహరబాద్ గ్రామానికి తాడేపు కిష్టయ్య రైల్వేలో పని చేసి రిటైర్మెంట్ అయ్యాడు. శనివారం పని నిమిత్తం మనోహరబాద్ రైల్వే స్టేషన్ నుంచి మల్కాజ్గిరి కి రైలులో వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కలిజారి రైలు కింద పడ్డారు. ఈ తరుణంలోనే అతని రెండు కాళ్లు విగిరిపోయాయి. దింతో మేడ్చల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయాడు. మృతునికి నలుగురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.

Next Story