పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి : పోలీస్ కమిషనర్ స‌న్ ప్రీత్ సింగ్

by Ratna Kumari |

పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ తెలిపారు.

పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి : పోలీస్ కమిషనర్ స‌న్ ప్రీత్ సింగ్
X

దిశ, హన్మకొండ కలెక్టరేట్ : పోలీస్ అధికారులకు పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రిత్ సింగ్ తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ సిరాజ్ పాషా, ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన రాజేంద్ర ప్రసాద్ ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలని అందజేశారు. అనంతరం పదోన్నతి పొందిన అధికారుల భుజాల పై పోలీసు కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి చిన్నహాలను అలంకరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నమ్మకానికి తగ్గట్లుగా విధులు నిర్వహిస్తూ, ప్రజల అభిమానాన్ని పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story