దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. మొక్క‌జొన్న‌ కొనుగోలు కేంద్రాన్ని సంద‌ర్శించిన సంఘం అధ్య‌క్షుడు

by Ratna Kumari |

ది విశాల స‌హ‌కార సంఘం ఆధ్వ‌ర్యంలో న‌డిపిస్తున్న మొక్క‌జొన్న‌ కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్య‌క్షుడు శ్రీప‌తి ర‌వీంద‌ర్ గౌడ్ సంద‌ర్శించారు.

దిశ క‌థ‌నానికి స్పంద‌న‌.. మొక్క‌జొన్న‌ కొనుగోలు కేంద్రాన్ని సంద‌ర్శించిన సంఘం అధ్య‌క్షుడు
X

దిశ‌, ఎల్క‌తుర్తి : ది విశాల స‌హ‌కార సంఘం ఆధ్వ‌ర్యంలో న‌డిపిస్తున్న మొక్క‌జొన్న‌ కొనుగోలు కేంద్రాన్ని సంఘం అధ్య‌క్షుడు శ్రీప‌తి ర‌వీంద‌ర్ గౌడ్ సంద‌ర్శించారు. మొక్క‌లు తీసుకొచ్చిన రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది క‌లుగ‌కుండా ఎండ‌లు తీవ్రంగా ఉండ‌టంతో రైతుల‌కు నీడ‌ను ఏర్పాటు చేశారు. చ‌ల్ల‌ని వాట‌ర్ ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అలాగే వ‌ర్షం వ‌చ్చినా మొక్క‌లు త‌డ‌వ‌కుండా ఏర్పాటు చేయాల‌ని సిబ్బందికి సూచించారు. శుక్ర‌వారం సాయంత్రం వ‌ర‌కు 16,663 బ‌స్తాల మక్క‌లు, 8331 క్వింటాళ్ల మొక్క‌జొన్న‌లు కొనుగోలు చేయ‌డం జ‌రిగింది. చాలా మంది రైతులు మొక్క‌జొన్న కొనుగోలు కేంద్రంలో ఉన్నాయి. గ‌న్ని సంచులు, లారీలు కొర‌త ఉన్నందువ‌ల్ల కొంచెం ఆల‌స్యం అవుతుంది. రైతులు ఓపిక ఉండాల‌ని అందరి రైతులు మొక్క‌జొన్న కొనుగోలు చేసి పంపిస్తామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో వైస్ చైర్మ‌న్ శేష‌గిరి, డైరెక్ట‌ర్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Next Story