- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ కథనానికి స్పందన.. వాటర్ ఫౌంటెన్ల పరిశుభ్రత
by Ratna Kumari |
మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన వాటర్ ఫౌంటెన్లు నిరుపయోగంగా మారాయి. గత ఏడాది బతుకమ్మ సంబరాల సందర్భంగా ఫౌంటెన్లు శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

X
దిశ, డోర్నకల్ : మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన వాటర్ ఫౌంటెన్లు నిరుపయోగంగా మారాయి. గత ఏడాది బతుకమ్మ సంబరాల సందర్భంగా ఫౌంటెన్లు శుభ్రపరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఫౌంటెన్ల జలకాంతులు కనిపించడం లేదని ఆదివారం దిశ దినపత్రిక " పండుగలకేనా ఫౌంటెన్ల జలకళ"ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో పురపాలక కమిషనర్ నిరంజన్ స్పందించారు. సిబ్బందితో దుర్వాసన వెదజల్లుతున్న నీటిని, పార్టీల జెండాలను తొలగింపజేశారు. వాటర్ ఫౌంటెన్లను త్వరలో వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించుటకు కృషి చేస్తున్నట్లు దిశ ప్రతినిధికి తెలియజేశారు. స్థానిక పౌరులు దిశకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.
Next Story






