- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీపీఎంకు రాజీనామా.. సీపీఐలో భారీ చేరికలు
మహబూబాద్ జిల్లాలోని గార్ల మండలానికి చెందినటువంటి సీపీఎం పార్టీకి చెందిన పలువురు నేతలు కార్యకర్తలు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐలోకి చేరారు.

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాద్ జిల్లాలోని గార్ల మండలానికి చెందినటువంటి సీపీఎం పార్టీకి చెందిన పలువురు నేతలు కార్యకర్తలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐలోకి చేరారు. ఈ సందర్భంగా సీపీఐ కండువా కాపీ కోణంనేని సాంబశివరావు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీపీఐ చేసే పోరాటాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా సీపీఐలో పలువురు చేరుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో గార్ల మండలం సీపీఎం కు రాజీనామా చేసి సీపీఐ లోచేరడం జరిగింది. మహబూబాద్ జిల్లాలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని మానుకోట జిల్లా ఉద్యమాలకు పుట్టినిల్లు అని అన్నారు. రాష్ట్రంలో సిపిఐ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ సిపిఐ అండగా ఉంటుందని పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు.
పార్టీలో చేరిన వారిలో..
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్షులు బి .అజయ్ సారధి రెడ్డి, నల్లు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కట్టెబోయిన శ్రీనివాస్, రేశపల్లి నవీన్, మండల కార్యదర్శి జంపాల వెంకన్న, జిల్లా కౌన్సిల్ సభ్యుడు మాగం లోకేష్ మండల సహాయ కార్యదర్శి రాగం రమేష్, పార్టీలో చేరిన వారిలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఎం జిల్లా కమిటీ మెంబర్ భూక్య హరినాయక్, మేదరమెట్ల గిరిప్రసాద్ సిపిఎం మాజీ మండల కార్యదర్శి,అన్నం శ్రీనివాస్ రాంపురం మాజీ ఉపసర్పంచ్, శేరిపురం సిపిఎం శాఖా కార్యదర్శి భూక్యా పూల్ సింగ్ ధారావత్ లక్మి ఐద్వా మండల నాయకురాలుభూక్య పద్మ ఐద్వా మండల నాయకురాలు, ముత్తి తండా సిపిఎం నేత భుక్య మంగీలాల్ సీతంపేట సిపిఎం నాయకుడు బానోతు వెంకన్న, ముత్తితండా సిపిఎం నాయకుడుభుక్య శ్రీను, మర్రిగూడెం సిపిఎం శాఖ నేత వాంకుడోత్ సోమ్లా నాయక్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.






