- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ మృతి..!
by velandi.Saikiran |
రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ మృతి సంఘటన నర్సంపేట పరిధిలో జరిగింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి వైపుగా

X
దిశ, నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో రిపోర్టర్ మృతి సంఘటన నర్సంపేట పరిధిలో జరిగింది. నర్సంపేట నుంచి మల్లంపల్లి వైపుగా వెళ్ళే జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగి రిపోర్టర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నర్సంపేట నుంచి రొట్టె సురేష్ (32) అనే వ్యక్తి నల్లబెల్లి మండలంలోని అర్షనపల్లి కి శనివారం బయలుదేరాడు. ద్విచక్ర వాహనంపై ఇటుకాలపల్లి శివారు దాటగానే జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సురేష్ స్పాట్ లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతున్ని రిపోర్టర్ గా గుర్తించారు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం నర్సంపేట ఆస్పత్రికి తరలించారు.
Next Story






