- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తులతో పోటెత్తిన రత్నగిరి జాతర
by velandi.Saikiran |
రత్నగిరి జాతరలో గుట్టపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి జాతర కన్నుల పండువగా జరిగింది.పొన్నం మామ పెద్ది వెంకటనారాయణ గౌడ్

X
దిశ, భీమదేవరపల్లి : మండలంలోని రత్నగిరి జాతరలో గుట్టపై కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి జాతర కన్నుల పండువగా జరిగింది. ముఖ్య అతిథి మంత్రి పొన్నం మామ పెద్ది వెంకటనారాయణ గౌడ్ మొక్కులు చెల్లించుకున్నారు. గుట్ట కింద ఉన్న ఆలయంలో వేకువజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్త జనులు గుట్ట పైకి ఎక్కి గుహలో కొలువు దీరిన స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారి సన్నిధిలో ఇందారం శ్రీనివాస శర్మ భక్తులకు గోత్ర నామార్చన తో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సీఐ పులి రమేష్, ఎస్సై దివ్య, కొలుగూరి రాజు, జాన ప్రవీణ్, మాచర్ల సదానందం, శ్రీకాంత్, రమేష్, తదితరులు ఉన్నారు.
Next Story






