రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి కేటీఆర్

by S Gopi |   (  Updated:2022-12-27 15:07:39  IST  )

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ప్రభుత్వ....Ration Dealers met KTR, Gangula Kamalaker

రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి కేటీఆర్
X

దిశ, హనుమకొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సారథ్యంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ను కలిసి సమస్యల పరిష్కారానికై వినతి పత్రం ఇచ్చారు. వారి సమస్యలపై మంత్రులు సానుకూలంగా స్పందించి.. రేషన్ డీలర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, ఎమ్మెల్సీ రవీందర్ రావు, రేషన్ డీలర్ల సంఘం నాయకులు నాగరాజు, సత్యనారాయణ, రాజయ్య పాల్గొన్నారు.

Next Story