- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారి పై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
by velandi.Saikiran |
చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది.

X
దిశ, ములుగు జిల్లా ప్రతినిధి: చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. జిల్లాలోని కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ (45) పై 2023లో నమోదైన కేసులో 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.6,000 జరిమానా విధించారని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్ర కళ ఈ మేరకు తీర్పు ఇచ్చారన్నారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ఈ కేసును ముదుకు తీసుకెళ్లిన కోర్టు మానిటరింగ్ అధికారి డిఎస్పి కిషోర్ , కోర్టు లైజనింగ్ అధికారి ఎస్ ఐ నాగరాజు , సీడీఓ సిబ్బంది కానిస్టేబుల్ కె. మౌనిక, పీసీ జె. మంగీలాల్ ను అభినందించారు.
- Tags
- minor girl
- prison
Next Story






