- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ఆర్సీపీ వీధి నాటకాలను జనం నమ్మరు: మంత్రి నారాయణ
నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు వేయడం సిగ్గుచేటని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

దిశ, నెల్లూరు ప్రతినిధి: నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు వేయడం సిగ్గుచేటని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చేసే డ్రామాలను జనం నమ్మరన్నారు.కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్‌లో పాల్గొన్న మంత్రి వైఎస్ఆర్సీపీ ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు.
నెల్లూరులో ఎంఎల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై జరుగుతున్న రాద్ధాంతంపై మంత్రి హాట్ మాట్లాడినారు చేశారు. అసలు ఆ నోటీసుల వ్యవహారం తనకు తెలియనే తెలియదని, మొన్న భీమవరంలో నారాయణ విద్యాసంస్థలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెబితేనే తనకు తెలిసిందని వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి నారాయణ గ్రూప్స్‌ను రకరకాలుగా వేధించారన్నారు.
అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి ఆందోళన చేసినా తాము ఓపిక పట్టి అధికారుల క్లియరెన్స్ తెచ్చుకున్నామే తప్ప రాజకీయం చేయలేదని గుర్తుచేశారు. మీలా లబ్ధి పొందాలనుకుంటే అప్పట్లో రోజుకో ఆందోళన చేసేవాళ్లమన్నారు.కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులను, విద్యాసంస్థలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని, ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించదని, తప్పు ఎక్కడ జరిగినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.






