- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షానికి తడిసిన వడ్లు.. కొనుగోళ్లలో ఆలస్యం పై రైతుల ఆందోళన
జనగామ వ్యవసాయ మార్కెట్‌లో రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా యార్డులో ఉంచిన వడ్లు, మక్కలు తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, జనగామ : జనగామ వ్యవసాయ మార్కెట్‌లో రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా యార్డులో ఉంచిన వడ్లు, మక్కలు తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతకాలంగా కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్న రైతులు, ఈ పరిస్థితితో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. కొంతమంది రైతులు మాట్లాడుతూ వర్షం నుంచి రక్షణ కోసం తగిన ఏర్పాట్లు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పరదాలు (తార్పాలిన్‌లు) వంటి సౌకర్యాలు సమయానికి అందితే పంట నష్టం తగ్గుతుందని సూచిస్తున్నారు. అలాగే వడ్లు ఆరబెట్టిన తర్వాత కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై మార్కెట్ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ స్పందిస్తూ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని మైక్‌ల ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన సదుపాయాలను మెరుగుపరచాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






