వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే రాహుల్ గాంధీ పర్యటన

by Ratna Kumari |

గత రెండేళ్లుగా వరుస ఓటములతో కుదేలైన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి విమర్శించారు.

వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే రాహుల్ గాంధీ పర్యటన
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : గత రెండేళ్లుగా వరుస ఓటములతో కుదేలైన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి విమర్శించారు. ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఎదురైన పరాజయాలతో గాంధీ నామకత్వంపై ప్రజల్లో విశ్వాసం పూర్తిగా సన్నగిల్లిందని, తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో గత రెండేళ్ల పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ వైఫల్యాలపై నోరు మెదపని రాహుల్ గాంధీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే హైదరాబాద్ పర్యటనకు వచ్చారని దుయ్యబట్టారు. సుమారు 5 వేల కోట్లతో మహాత్మా గాంధీ పేరు మీద చేపడుతున్న పనుల కోసం పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నా రాహుల్ గాంధీ కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా రావు పద్మారెడ్డి హెచ్చరించారు.

Next Story