- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన అందిస్తారని బావుపేట స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్. మనోహర్ నాయక్ అన్నారు.

దిశ, ఎల్కతుర్తి : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన అందిస్తారని బావుపేట స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్. మనోహర్ నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దండేపల్లి ఆధ్వర్యం లో బుధవారం ప్రొ. జయ శంకర్ బడి బాట కార్యక్ర మాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెండా ఊపి ప్రారంభించారు. హెచ్.ఎం. మనోహర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యా బోధన అందిస్తారని, అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బృందం ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యే రీతిలో ప్రత్యేక బోధన, విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్, ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు బుక్స్ తో పాటు, రెండు రోజులు రాగి జావా, వారానికి మూడు రోజులు కోడి గ్రుడ్లు, పౌష్టిక ఆహారం అందిస్తారని తెలిపారు. ఇంటి ఇంటికి తిరిగి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు ఎల్. మనోహర్ నాయక్, రాజేశ్వరయ్య చారీ ఉపాధ్యాయులు ముకుంద రెడ్డి, శ్రీధర్, యం. రవికుమార్, పబ్బు రాజు అనిత, శారదా, ప్రభ, సునీత,రాధిక పీఈటీ సుధాకర్ విద్యార్థులు పాల్గొన్నారు.






