- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమార స్వామి పేర్కొన్నారు.

దిశ, భీమదేవరపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని భీమదేవరపల్లి సర్పంచ్ మాచర్ల కుమార స్వామి పేర్కొన్నారు. శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం బోధనతో పాటు డిజిటల్ విద్య, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు వంటి సదుపాయాలు ప్రభుత్వం అందిస్తోందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అర్హత కలిగినవారై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలలకు అధిక ఫీజులు చెల్లించి పిల్లలను పంపడం కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంచుకోవాలని సూచించారు. గ్రామంలోని ప్రతి విద్యార్థి పాఠశాలలో చేరేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలని, వారికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు వేణు, కేజీబీవీ ఇన్‌చార్జీ జ్యోతి, ఉపాధ్యాయులు రాజేందర్, మోహన్, శ్రీధర్, సెక్రటరీ రాజు పాల్గొన్నారు.






